Wednesday, November 26, 2008

ఆత్మ కధ

అస్సలు ఆత్మ అంటె ఏమిటి? ఆత్మ గుణం ఏమిటి? మనము ఎలా తెలుసుకోగలము అనే విషయాలని మన పూర్వులు ఉపనిషత్తులలో కూలంకుషం గా చర్చించారు

పూర్తి కథ ఇక్కడా...

http://www.andhrafolks.net/ReadArticle.asp?Type=A&ID=374

మల్లెపూలు + మంచిగంధం = కృష్ణశాస్త్రి కవిత్వం

మన సినీకవులు చాలామంది ఓ అందమైన కథానాయికను వర్ణించాలంటే ఆమెను బాపూబొమ్మతోనో, కృష్ణశాస్త్రి కవితతోనో పోలుస్తూవుంటారు. బాపు వేలాది బొమ్మలు గీశారు. కాని, దేవులపల్లి కృష్ణశాస్త్రి మాత్రం చాలా తక్కువ గీతాలే రచించారు. ఐనా, అవి యీనాటికీ లక్షలాది సాహితీప్రియులను అలరిస్తూనే వున్నాయి...

పూర్తి కథ ఇక్కడా...

http://www.andhrafolks.net/ReadArticle.asp?Type=A&ID=370

Friday, October 10, 2008

ద్రౌపది- అసలు కథ

అసలు ద్రౌపది ఎవరు?

ఆమె ఐదుగురు భర్తలని ఎందుకు వివాహం చేసుకో వలసి వచ్చింది?

మహాభారత యుద్దంలో ఆమె పాత్ర ఏమిటి?

పూర్తి కథ ఇక్కడ...

http://www.andhrafolks.net/ReadArticle.asp?Type=A&ID=331

Tuesday, October 7, 2008

శర్మగారు - స్వదేశీ యానం

హైద్రాబాదులో ఆంధ్రఫోక్స్ మిత్రుల కలయిక...

http://www.andhrafolks.net/ReadArticle.asp?Type=A&ID=322

Sunday, October 5, 2008

విధివంచిత ద్రౌపది

జీవితం నటన కాదు. నటనలో జీవించేవారికీ, జీవితములో నటించేవారికీ కూడా నటనకు సంబంధించని వేరే జీవితం వుంటుంది. ఉండకపోతే వాళ్ళంత దురదృష్టవంతులు లోకములో వుండరు.

లోకములో వున్న దురదృష్టవతులందరిలోనూ మరీ దురదృష్టవతిగా కనబడుతుంది నాకు ద్రౌపది.

పూర్తి కథ ఇక్కడా...

http://www.andhrafolks.net/ReadArticle.asp?Type=A&ID=314

భారవి

కాళిదాసు వ్రాసిన రఘువంశం, మేఘసందేశం, కుమారసంభవం, మాఘమహాకవి వ్రాసిన శిశుపాలవధ, భారవి వ్రాసిన కిరాతార్జునీయం ఈ అయిదింటిని పంచమహాకావ్యాలంటారు

అయితే భారవి గురించి ఒక కధ వాడుకలోవుంది.

పూర్తి కథ ఇక్కడా...

http://www.andhrafolks.net/ReadArticle.asp?Type=A&ID=317

Monday, September 29, 2008

సీమ కక్షలు

ఫ్యాక్షన్ గురించి ప్రభుత్వాలు, మీడియా మాట్లాడడం ఎప్పుడు ప్రారంభమైందో, సరిగ్గా అప్పటికి వారు మాట్లాడే ఫ్యాక్షన్స్ ఇక్కడ లేవు. నిజానికి 1980 దశకం నుంచి రాయలసీమలో వున్న ఫ్యాక్షన్స్ , రాయలసీమకే పరిమితమైన ఫ్యాక్షన్స్ ఎంతమాత్రమూ కాదు. ఆంధ్రరాష్ట్రమంతటా, ఆ మాటకొస్తె దేశమంతటా విస్తరించుకొన్న ఒక రాజకీయ పరిణామం. ఈ కక్షల కోణం నుంచి రాయలసీమ అధ్యయనం చేయడానికి ఈ కథలు ఒక దిక్సూచి.

పూర్తి కథ ఇక్కడ

http://www.andhrafolks.net/ReadArticle.asp?Type=N&ID=306

1.నేను బతకలేను సిన్నమ్మా!

2. చుక్క పొడిచింది

3. ఆయుధం

4. చంద్రగ్రహణం

Wednesday, September 24, 2008

బోధిసత్వం - బుద్ధుడి తత్వం

సిద్ధార్థుడు రాజ్యమొదిలి వెళుతుంటే వెంటపడిన తన భార్య యశోధరకి ఏ విధంగా నచ్చచెప్పాడో అన్నదే ఈ కథ.

http://www.andhrafolks.net/ReadArticle.asp?Type=A&ID=299

నోస్టాల్జియా (జ్ఞాపకాలు)

ప్రపంచమ్ మారుతోంది, దానితో పాటు మనమూ. కొన్ని బొమ్మలు చూసినా లేదా ఆర్టికల్స్ చదివినా మనకు పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చి గ్యారంటీగా "ఆ రోజులే వేరు" అనుకుంటాము. నాకొచ్చిన ఒక ఈమెయిల్ మీ అందరితో పంచుకోవాలని ఇక్కడ పెడుతున్నా. నచ్చితే ఓటు వెయ్యండి. :)

http://www.andhrafolks.net/DispResp.asp?PostedBy=Yamakinkarudu&PostNumber=18783

Sunday, September 14, 2008

నే చూసిన నా చుట్టు ఉన్న ప్రపంచం

మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతుంటాయి. మనం చూస్తుంటాము తప్పించి ఏమీ చెయ్యలేని పరిస్తితి లేదా మనకెందుకొచ్చిందీ గొడవ అనే మనస్తత్వం. నా ముందే ఎన్నో జరిగాయ్. వాటిని చూసి ఆలోచిస్తా వీళ్ళెందుకు ఇలా చేస్తున్నారు అని. అంతకు మించి నేనమన్నా చేయగలిగానా అంటే, ఏమో??? అయితే, పెద్ద మనషులు ఆచార వ్యవహారాలు గురించి పెద్ద పెద్ద ఉపన్యాసాలలో చెప్పే వాటికి, కళ్ళముందు జరుగుతున్న వాటికి చాలా చాలా వ్యత్యాసం ఉందని మాత్రం గుర్తించా. నేను వ్యక్తిగా ఎదగడానికి కాస్తో కూస్తో ఈ సంఘటనలు కూడా ఉపయోగ పడ్డాయి. అయితే ఒక స్థిరమైన అభిప్రాయాం తోనో లేక స్థిరమైన ఒక ప్రమాణికం అన్న కోణం నుండో చూడలేదు. కేవలం యధాతదంగా తీసుకున్నా, అలాగే యధాతదంగా మీ ముందు ఉంచుతున్నా నా చుట్టూ జరిగిన యాదార్థ సంఘటనలు ఆధారంగా తయారు చేసిన గాథలు.

http://www.andhrafolks.net/ReadArticle.asp?Type=N&ID=273

!!! ప్రతి వారం మీ ముందు !!!

  1. క్షణికావేశం

  2. గారాబం

  3. తప్పుడు మనిషి

  4. ఓ మనిషి తిరిగి చూడు

  5. తల్లి మనసు

  6. డబ్బుడబ్బు

Sunday, August 24, 2008

!!! మనసున్న ప్రేమ !!!

వీక్లీ సీరియల్

!!! ప్రతి సోమవారం మీ ముందు !!!

http://www.andhrafolks.net/ReadArticle.asp?Type=N&ID=232

New Pages Added - Oct 26, 2008

(End Of Weekly Serial)

తెలుగింటి సత్యభామ

సుమారు పాతికేళ్ళ క్రితం శ్రీ ఎస్వీ భుజంగరాయశర్మగారు ఆకాశవాణిలో కొన్ని సాహితీప్రసంగాలు చేశారు. అవి శ్రోతలను బాగా అలరించాయట! ఆ ప్రసంగవ్యాసాలను ఆలకించే అదృష్టం నాకు కలగలేదుకాని, ఆ తర్వాత కొంతకాలానికి ఆయన ప్రసంగాలు "దీపమాలిక" అనే పేరుతో పుస్తకరూపములో వచ్చినప్పుడు పఠించే భాగ్యం కలిగింది. వాటిల్లో ఆయన మన ప్రభంధనాయికల గురించి చాలా చక్కగా వ్రాశారు. ముఖ్యంగా "తెలుగింటి సత్యభామ" అనే వ్యాసం నన్ను బాగా ఆకట్టుకున్నది. దానిని మీ అందరి దృష్టికి తేవాలని ఈ ప్రయత్నం. ఇక చదవండి...

http://www.andhrafolks.net/ReadArticle.asp?Type=A&ID=231

Monday, August 4, 2008

!!! మామమెరికీయం (అమెరికా ఇతివృత్తంతో హాస్య నాటిక) !!!

ఈ నాటిక తొలిసారి 1990 జనవరి 13 న హ్యూష్టన్ లో ప్రదర్శింపబడింది. Hilarious, a must read. :)

http://www.andhrafolks.net/ReadArticle.asp?Type=A&ID=198

Monday, July 28, 2008

!!! సమాంతర రేఖలు !!!

ధరణిన్ శ్వశ్రువులాడు మాటల గతిన్, దత్సాథి సాధింపులన్,
పరపుత్రంచును కోడలున్ గనెడు దౌర్భాగ్యంపు యో యత్తకున్
పరముంజేరువ యైనవేళ మదిలో ప్రాప్తించు మార్పున్ "సమాం
తర రేఖల్" వివరించునిచ్చట కనుండమ్మా! మదిన్నిల్పుచున్

పూర్తి కథ ఇక్కడా...

http://www.andhrafolks.net/ReadArticle.asp?Type=N&ID=194

:)

Monday, July 14, 2008

!!! చారి విజయ (వాడ) యాత్ర !!!

ఆంధ్రఫోక్స్ మెంబర్ చారీ విజయవాడలో జరిగిన వైస్ మెన్ ఇంటర్నేషల్ ఫంక్షన్ కి వెళ్ళి అక్కడ మిగతా ఆంధ్రాఫోక్స్ మెంబర్స్ ని కలిసి తన అనుభవాలను చెప్పినదే ఈ చారి విజయ(వాడ) యాత్ర. ఫుల్ స్టోరీ ఇక్కడ...
http://www.andhrafolks.net/ArticlesMain.asp?Option=1&URLlink=ReadArticle%2Easp%3FType%3DA%26ID%3D179

Thursday, May 8, 2008

సర్వధారి వసంతోత్సవ కవిసమ్మేళనం

మే 10న ఆంధ్రాఫోక్స్ అధ్వర్యంలో విజయవాడలో జరిగే వసంతోత్సవ కవిసమ్మేళనానికి అందరూ ఆహ్వానితులే. వివరాలు ఇక్కడ.

http://www.andhrafolks.net/DispResp.asp?PostedBy=Kvbsastri&PostNumber=154

Monday, May 5, 2008

' పరుగు ' సినిమా

వెబ్ రివ్యూలు చదివి వెళ్ళాలా వద్దా అనుకున్నా. సరే వీకెండ్ పిల్లలెల్లాగో అక్కడికీ ఇక్కడికీ తీసుకెళ్ళమని బుర్ర తింటారు, దాని బదులు సైన్మాకెళితేనే బెటరనుకున్నా. దేశముదురులో అల్లు అర్జున్ పెట్టిన కేకలు ఇంకా చెవిలో గింగురుమంటున్నాయ్, ఐనా ధైర్యమ్ చేసా, బొమ్మరిల్లు భాస్కర్ మీద నమ్మకంతో అంతా కలిసి మొత్తానికీ చూడటానికి వెళ్ళాము...

http://www.andhrafolks.net/DispResp.asp?PostedBy=Yamakinkarudu&PostNumber=15502

Sunday, April 27, 2008

గగనయానంలో అంతర్ మథనం

డబ్భై వసంతాలు నిండిన శాస్త్రి గారు ఇష్టం లేకపోయినా పరిస్థితుల మూలంగా అమెరికా వెళ్ళాల్సి వచ్చి, గగనయానంలో ఉండగా వెనుకటి విషయాలు నెమరువేసుకుంటూ, మాతృదేశం వదిలి వెళ్ళిపోతున్నాననే బాధ ఒక ప్రక్క, తనతో ఇన్నేళ్ళు కలిసి ఉన్న భార్య, పిల్లలు, మనవళ్ళని కలుసుకోబోతున్నాననే ఆనందం మరో ప్రక్క, ఇల్లాంటి ఆలోచనల మధ్య కొట్టుమిట్టాడుతా చివరకు అమెరికా చేరిని తీరు కాలనాథభట్ట వీరభద్ర శాస్త్రిగారి కలం నుంచి వచ్చిన అద్భుత మినీ నవలే ఈ ' గగనయానంలో అంతర్ మథనం '.

http://www.andhrafolks.net/ReadArticle.asp?Type=N&ID=119

Wednesday, April 9, 2008

۞♫ శ్రీ వేంకటేశ్వర స్తోత్రమ్ ♫۞

http://www.andhrafolks.net/ReadArticle.asp?Type=A&ID=2

۞♫ శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం ♫۞

http://www.andhrafolks.net/ReadArticle.asp?Type=A&ID=1

నేనింకా ప్రోగ్రామర్నే

నేనీ కంపెనీలో 14 ఏళ్ళ నుంచి చేస్తున్నా. ప్రోగ్రామర్గా జాయిన్ అయ్యాను 1994 లో, ఈ రోజు సీనియర్ మ్యానేజర్ అయ్యాను. నిజమ్ చెప్పాలంటే అస్సలీ కంపెనీలో చేరుతానని నేనెప్పుడూ ఎక్స్పెక్ట్ చెయ్యలేదు. 1994 లో ఈ కంపెనీ వాళ్ళు హైదరాబాదు కృష్ణా ఓబెరాయ్ హోటెల్లో ఇంటర్వ్యూలు చేస్తుంటే మా అక్క ఒకటే పోరు వెళ్ళమని అమెరికా చాన్స్ వస్తుందని. నాకో డొక్కు లూనా ఉండేది, బయలుదేరాను. ఆ ముందు రోజు వర్షమ్ పడటంతో రోడ్లన్నీ నీళ్ళ మయమ్.

సరే నేను బేగంపేట బ్రిడ్జ్ దిగి గ్రీన్ పార్క్ వైపు తిరిగానో లేదో, బస్సోడు రయ్ మని నన్ను దాటుకుంటూ వెళ్ళి నా మీద బురద నీళ్ళు చల్లి పోయాడు. ఏమ్ చేస్తామ్ అల్లాగే నడుపుకుంటూ పోయా. ఒక చోట నీళ్ళ పంపు కనపడితే ఆపి, రుమాల తడిపి మొత్తానికీ బురద మరకలు పోగొట్టాను. ఓబెరాయ్ హోటెల్లో డొక్కు లూనాతో ఎంటరౌతుంటే గేట్కీపర్ ఆపాడు. ఫలానా కంపెనీలో ఇంటర్వ్యూ రా నాయనా అంటే వదిలేశాడు. అల్లాగే అక్కడక్కడ తడి మరకలతో ఎటెండయ్యా, దాని దుంప తెగ నాకు అమెరికా రావలని రాసి పెట్టి ఉందో ఏమిటో సెలెక్ట్ అయ్యాను.

నిజమ్ చెప్పాలంటేనండి కత్తి ప్రోగ్రామర్ని అని చెప్పుకోవచ్చు కానీ వద్దులేండి సెల్ఫ్ డబ్బా ఔతుంది, అబవ్ యావఏజ్ ప్రోగ్రామర్ని. సిద్ధార్థా ఇంజినీరింగ్ కాలేజిలో బీ.టెక్ కంప్యూటర్ సైన్స్ చేసా (1988-1992). ఈ రోజుకి ప్రోగ్రామింగ్ బానే చేస్తా.

సరే మొత్తానికి అమెరికా వచ్చే చాన్సొచ్చింది, కామ్సిస్ వాళ్ళు ఓ కంపెనీలో కాంట్రాక్టరుగా నన్ను ప్లేస్ చేసారు. అది ఒక బ్యాంకింగ్ సొల్యూషన్స్ కంపెనీ. వాళ్ళ ప్రాడక్ట్ నేర్చుకోవటానికి నాకు ఆరు నెలలు పట్టింది. ఇక ఆ తర్వాత దున్నుడే దున్నుడు, మంచి పేరు సంపాయించా. ఆ రోజుల్లో మా డెవెలప్మెంట్ గ్రూపులో ఒక్క తెల్ల వాళ్ళే ఉండేవాళ్ళు, వేరే వాళ్ళని నమ్మేవాళ్ళు కాదు. ఎల్లాగైతేనేమి మంచి పేరు సంపాయించి ఆ గ్రూపులో ఎంట్రీ సంపాయించా.

నేను కొంచెమ్ టాకిటివ్ పెర్సన్ని. స్కూల్ రోజుల్లో విజయవాడలో ఇంగ్లీష్ డిబేటింగులో మూడు సార్లు ఫస్ట్ వచ్చాను. 1998లో మా డైరెక్టర్ నా ట్యాలెంట్ చూసి నన్ను ప్రాజెక్ట్ మ్యానేజర్ చేసాడు. ఒక కాంట్రాక్టర్ మ్యానేజర్ అవ్వటమ్ అదే ఫస్ట్ టైముట మా కంపెనీలో. అప్పటికి నాకింకా పచ్చ కార్డ్ అప్లై చేసాను కానీ రాలేదు.

నేను ప్రాజెక్ట్ మ్యానేజర్ని ఐనా కూడా, ట్యాస్కులు కొన్ని నాకు ఎస్సైన్ చేసికునే వాడ్ని. ఎందుకంటే నాకు ప్రోగ్రామింగంటే మక్కువ. అక్కడ కూడ మంచి పేరే సంపాయించాను. నా బొంద మంచి పేరంటే, అంతా తెలిసినవాళ్ళే అప్పటికే 4 ఏళ్ళనుంచి పనిచేస్తున్నా అక్కడే, వినక చస్తారా.

అల్లా అల్లా ఒక్కో మెట్టు ఎక్కుకుంటూ ఈ రోజు డెవలప్మెంట్ మ్యానేజర్ని అయ్యాను. కోడింగ్ అంటారా, మా ప్రాడక్టులో ఎక్కడైనా ప్రాబ్లమొస్తే నిద్రలో లేపినా చెప్పేస్తాను ఏ ఫైల్ మార్చాలో. నేను రోజు రోజుకి ప్రోగ్రామింగుకి దూరమైపోతున్నాననే బాధ ఒక పక్క, ఇంకో పక్క మెట్లు ఎక్కుతున్నాననే ఆనందమ్, ఏది ఏమైనా ఈ రోజుకి కొన్ని ట్యాసుకులు నాకు ఎస్సైన్ చేసికుంటా. సెల్ఫ్ డబ్బా కొడుతున్నాననుకోపోతే ఒక్క మాట, నేను ఈ రోజుకి ఎటువంటి సిస్టమైనా కోడ్ చెయ్యగలను మైక్రోసాఫ్ట్ టెక్నాలాజీ మీద. సరే ఈ లోపు పచ్చ కార్డ్ రావటమ్ నన్ను పెర్మనెంట్ ఎంప్లాయీగా చేర్చుకొవటమ్ కూడా జరిగిపోయాయి.

ఈ మధ్య మాకు వైస్ ప్రెసిడెంట్ మారి, నన్ను అస్సలు ప్రోగ్రామింగ్ చెయ్యనియ్యట్లేదు. మ్యానేజర్గా సెపరేట్ రూము, పవర్ అనుభవిస్తున్నా కానీ ఏదో తెలీని లోటు. అదేమిటంటే నేను ప్రోగ్రామింగుకి దూరమయ్యాననే బాధ. ఇంకా ఏమి చెయ్యాలా అని ఆలోచిస్తున్న తరుణంలో, ఓ సైట్ క్రియేట్ చేస్తే పోలా అనిపించి http://www.andhrafolks.net/ క్రియేట్ చేసాను, కొంతమంది సాయంతో అదే ఇన్పుట్టుతో. కోడింగ్ మొత్తమ్ నేనే చేసా. ఈ రోజుకీ సైటులో ఏమన్నా చేంజెస్ చెయ్యాలంటే నేనే చేస్తా. మా డైరెక్టర్ అప్పుడప్పుడూ అంటుండేవాడు Srini, you are more of a Programmer than a Manager అని. బహుశా నిజమేమో. ఏది ఏమైనా ఇప్పుడు ఆనందంగా ఉన్నా, ఎందుకంటే ఆఫీసులో ప్రోగ్రామింగ్ మిస్సైనా, ఆంధ్రాఫోక్స్ లో చేస్తున్నా.

అక్కడే డైరెక్టుగా తెలుగు టైప్ చెయ్యవచ్చు. లేఖిని వాళ్ళు పెద్ద మనసుతో సోర్స్ చేంజ్ చేసికోవచ్చు అంటే, దాన్ని మార్చి డీబీలలో పని చేసేలా చేసాను. ఇది చూడండి.

http://www.andhrafolks.net/FontHelp.asp
మీకు టైమున్నప్పుడు ఓ పాలి విసిట్ చెయ్యండి, ఏమన్న సజెషన్సుంటే ఇవ్వండి.