Sunday, April 27, 2008

గగనయానంలో అంతర్ మథనం

డబ్భై వసంతాలు నిండిన శాస్త్రి గారు ఇష్టం లేకపోయినా పరిస్థితుల మూలంగా అమెరికా వెళ్ళాల్సి వచ్చి, గగనయానంలో ఉండగా వెనుకటి విషయాలు నెమరువేసుకుంటూ, మాతృదేశం వదిలి వెళ్ళిపోతున్నాననే బాధ ఒక ప్రక్క, తనతో ఇన్నేళ్ళు కలిసి ఉన్న భార్య, పిల్లలు, మనవళ్ళని కలుసుకోబోతున్నాననే ఆనందం మరో ప్రక్క, ఇల్లాంటి ఆలోచనల మధ్య కొట్టుమిట్టాడుతా చివరకు అమెరికా చేరిని తీరు కాలనాథభట్ట వీరభద్ర శాస్త్రిగారి కలం నుంచి వచ్చిన అద్భుత మినీ నవలే ఈ ' గగనయానంలో అంతర్ మథనం '.

http://www.andhrafolks.net/ReadArticle.asp?Type=N&ID=119

Wednesday, April 9, 2008

۞♫ శ్రీ వేంకటేశ్వర స్తోత్రమ్ ♫۞

http://www.andhrafolks.net/ReadArticle.asp?Type=A&ID=2

۞♫ శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం ♫۞

http://www.andhrafolks.net/ReadArticle.asp?Type=A&ID=1

నేనింకా ప్రోగ్రామర్నే

నేనీ కంపెనీలో 14 ఏళ్ళ నుంచి చేస్తున్నా. ప్రోగ్రామర్గా జాయిన్ అయ్యాను 1994 లో, ఈ రోజు సీనియర్ మ్యానేజర్ అయ్యాను. నిజమ్ చెప్పాలంటే అస్సలీ కంపెనీలో చేరుతానని నేనెప్పుడూ ఎక్స్పెక్ట్ చెయ్యలేదు. 1994 లో ఈ కంపెనీ వాళ్ళు హైదరాబాదు కృష్ణా ఓబెరాయ్ హోటెల్లో ఇంటర్వ్యూలు చేస్తుంటే మా అక్క ఒకటే పోరు వెళ్ళమని అమెరికా చాన్స్ వస్తుందని. నాకో డొక్కు లూనా ఉండేది, బయలుదేరాను. ఆ ముందు రోజు వర్షమ్ పడటంతో రోడ్లన్నీ నీళ్ళ మయమ్.

సరే నేను బేగంపేట బ్రిడ్జ్ దిగి గ్రీన్ పార్క్ వైపు తిరిగానో లేదో, బస్సోడు రయ్ మని నన్ను దాటుకుంటూ వెళ్ళి నా మీద బురద నీళ్ళు చల్లి పోయాడు. ఏమ్ చేస్తామ్ అల్లాగే నడుపుకుంటూ పోయా. ఒక చోట నీళ్ళ పంపు కనపడితే ఆపి, రుమాల తడిపి మొత్తానికీ బురద మరకలు పోగొట్టాను. ఓబెరాయ్ హోటెల్లో డొక్కు లూనాతో ఎంటరౌతుంటే గేట్కీపర్ ఆపాడు. ఫలానా కంపెనీలో ఇంటర్వ్యూ రా నాయనా అంటే వదిలేశాడు. అల్లాగే అక్కడక్కడ తడి మరకలతో ఎటెండయ్యా, దాని దుంప తెగ నాకు అమెరికా రావలని రాసి పెట్టి ఉందో ఏమిటో సెలెక్ట్ అయ్యాను.

నిజమ్ చెప్పాలంటేనండి కత్తి ప్రోగ్రామర్ని అని చెప్పుకోవచ్చు కానీ వద్దులేండి సెల్ఫ్ డబ్బా ఔతుంది, అబవ్ యావఏజ్ ప్రోగ్రామర్ని. సిద్ధార్థా ఇంజినీరింగ్ కాలేజిలో బీ.టెక్ కంప్యూటర్ సైన్స్ చేసా (1988-1992). ఈ రోజుకి ప్రోగ్రామింగ్ బానే చేస్తా.

సరే మొత్తానికి అమెరికా వచ్చే చాన్సొచ్చింది, కామ్సిస్ వాళ్ళు ఓ కంపెనీలో కాంట్రాక్టరుగా నన్ను ప్లేస్ చేసారు. అది ఒక బ్యాంకింగ్ సొల్యూషన్స్ కంపెనీ. వాళ్ళ ప్రాడక్ట్ నేర్చుకోవటానికి నాకు ఆరు నెలలు పట్టింది. ఇక ఆ తర్వాత దున్నుడే దున్నుడు, మంచి పేరు సంపాయించా. ఆ రోజుల్లో మా డెవెలప్మెంట్ గ్రూపులో ఒక్క తెల్ల వాళ్ళే ఉండేవాళ్ళు, వేరే వాళ్ళని నమ్మేవాళ్ళు కాదు. ఎల్లాగైతేనేమి మంచి పేరు సంపాయించి ఆ గ్రూపులో ఎంట్రీ సంపాయించా.

నేను కొంచెమ్ టాకిటివ్ పెర్సన్ని. స్కూల్ రోజుల్లో విజయవాడలో ఇంగ్లీష్ డిబేటింగులో మూడు సార్లు ఫస్ట్ వచ్చాను. 1998లో మా డైరెక్టర్ నా ట్యాలెంట్ చూసి నన్ను ప్రాజెక్ట్ మ్యానేజర్ చేసాడు. ఒక కాంట్రాక్టర్ మ్యానేజర్ అవ్వటమ్ అదే ఫస్ట్ టైముట మా కంపెనీలో. అప్పటికి నాకింకా పచ్చ కార్డ్ అప్లై చేసాను కానీ రాలేదు.

నేను ప్రాజెక్ట్ మ్యానేజర్ని ఐనా కూడా, ట్యాస్కులు కొన్ని నాకు ఎస్సైన్ చేసికునే వాడ్ని. ఎందుకంటే నాకు ప్రోగ్రామింగంటే మక్కువ. అక్కడ కూడ మంచి పేరే సంపాయించాను. నా బొంద మంచి పేరంటే, అంతా తెలిసినవాళ్ళే అప్పటికే 4 ఏళ్ళనుంచి పనిచేస్తున్నా అక్కడే, వినక చస్తారా.

అల్లా అల్లా ఒక్కో మెట్టు ఎక్కుకుంటూ ఈ రోజు డెవలప్మెంట్ మ్యానేజర్ని అయ్యాను. కోడింగ్ అంటారా, మా ప్రాడక్టులో ఎక్కడైనా ప్రాబ్లమొస్తే నిద్రలో లేపినా చెప్పేస్తాను ఏ ఫైల్ మార్చాలో. నేను రోజు రోజుకి ప్రోగ్రామింగుకి దూరమైపోతున్నాననే బాధ ఒక పక్క, ఇంకో పక్క మెట్లు ఎక్కుతున్నాననే ఆనందమ్, ఏది ఏమైనా ఈ రోజుకి కొన్ని ట్యాసుకులు నాకు ఎస్సైన్ చేసికుంటా. సెల్ఫ్ డబ్బా కొడుతున్నాననుకోపోతే ఒక్క మాట, నేను ఈ రోజుకి ఎటువంటి సిస్టమైనా కోడ్ చెయ్యగలను మైక్రోసాఫ్ట్ టెక్నాలాజీ మీద. సరే ఈ లోపు పచ్చ కార్డ్ రావటమ్ నన్ను పెర్మనెంట్ ఎంప్లాయీగా చేర్చుకొవటమ్ కూడా జరిగిపోయాయి.

ఈ మధ్య మాకు వైస్ ప్రెసిడెంట్ మారి, నన్ను అస్సలు ప్రోగ్రామింగ్ చెయ్యనియ్యట్లేదు. మ్యానేజర్గా సెపరేట్ రూము, పవర్ అనుభవిస్తున్నా కానీ ఏదో తెలీని లోటు. అదేమిటంటే నేను ప్రోగ్రామింగుకి దూరమయ్యాననే బాధ. ఇంకా ఏమి చెయ్యాలా అని ఆలోచిస్తున్న తరుణంలో, ఓ సైట్ క్రియేట్ చేస్తే పోలా అనిపించి http://www.andhrafolks.net/ క్రియేట్ చేసాను, కొంతమంది సాయంతో అదే ఇన్పుట్టుతో. కోడింగ్ మొత్తమ్ నేనే చేసా. ఈ రోజుకీ సైటులో ఏమన్నా చేంజెస్ చెయ్యాలంటే నేనే చేస్తా. మా డైరెక్టర్ అప్పుడప్పుడూ అంటుండేవాడు Srini, you are more of a Programmer than a Manager అని. బహుశా నిజమేమో. ఏది ఏమైనా ఇప్పుడు ఆనందంగా ఉన్నా, ఎందుకంటే ఆఫీసులో ప్రోగ్రామింగ్ మిస్సైనా, ఆంధ్రాఫోక్స్ లో చేస్తున్నా.

అక్కడే డైరెక్టుగా తెలుగు టైప్ చెయ్యవచ్చు. లేఖిని వాళ్ళు పెద్ద మనసుతో సోర్స్ చేంజ్ చేసికోవచ్చు అంటే, దాన్ని మార్చి డీబీలలో పని చేసేలా చేసాను. ఇది చూడండి.

http://www.andhrafolks.net/FontHelp.asp
మీకు టైమున్నప్పుడు ఓ పాలి విసిట్ చెయ్యండి, ఏమన్న సజెషన్సుంటే ఇవ్వండి.